సినిమా

Ram Gopal Varma: పోలీస్ విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma: ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట మరో సారి సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారణకి హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ని కించ పరుస్తూ రాంగోపాల్ వర్మ తన ఎక్స్ లో పోస్టింగ్స్ పెట్టారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాంగోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పెట్టారు. రాంగోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్‌పై ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రామలింగం ఫిర్యాదు పై గత ఏడాది నవంబరు 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. అప్పట్లో విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకి పోలీసులు నోటీలు జారీ చేసినా ఆయన ముఖం చాటేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు.

కానీ రాంగోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించలేదు. పోలీసుల విచారణకి హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈఏడాది ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ విచారణకి హాజరయ్యారు.

రాంగోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్‌పై రూరల్ సీఐ శ్రీకాంత్ 8 గంటల పాటూ విచారించి పంపారు. ఈ రోజు మరో సారి విచారణకు హాజరుకావాలని వర్మకి పోలీసులు నోటీలు జారీ చేశారు. దీంతో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు.

రాంగోపాల్ వర్మతో పాటు ఆయన లాయర్లను విచారణకి పోలీసులు అనుమతించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై అనుచిత పోస్టింగ్స్ వెనుక ఎవరు ఉన్నారు, ఫైబర్ నెట్ నుండి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు ఎలా ఇచ్చారు అన్న కోణంలో విచారణ జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button