Ram Gopal Varma: చిరంజీవికి వర్మ క్షమాపణలు!

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘శివ’ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవికి క్షమాపణలు కోరారు. శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవికి థాంక్స్ చెప్పారు.
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు క్షమాపణలు కోరడం విశేషం. తన తొలి చిత్రం ‘శివ’ రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవికి థాంక్స్ చెప్పారు. అనుకోకుండా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని వర్మ ట్వీట్ చేశారు. చిరంజీవి విశాల హృదయానికి కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో చిరంజీవి హీరోగా ‘వినాలని ఉంది’ సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. వర్మ పోస్టులు సాధారణంగా వివాదాలు రేకెత్తిస్తాయి. కానీ ఈసారి క్షమాపణలతో ఆశ్చర్యం కలిగించారు. ‘థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు. మీ విశాల హృదయంతో విష్ చేసినందుకు కృతజ్ఞతలు’ అని వర్మ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.



