సినిమా

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ సంచలనం.. మాస్ హైప్ టాప్ గేర్!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రామ నవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ షాట్ అభిమానులను మైండ్ బ్లాక్ చేసింది.

‘పెద్ది’ గ్లింప్స్‌లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్, బ్యాట్‌ను గుద్ది పట్టు సవరించి బాల్ కొట్టే సీన్ యువతను ఫిదా చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ షాట్ గట్టి రీచ్ సొంతం చేసుకోగా, రీల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఒక్క గ్లింప్స్‌తోనే సినిమాకు భారీ హైప్, రీచ్ లభించాయని చెప్పొచ్చు.

ఏఆర్ రెహమాన్ సంగీతం, వృద్ధి సినిమాస్ నిర్మాణంతో ఈ చిత్రం అంచనాలను రెట్టింపు చేస్తోంది. రామ్ చరణ్ మాస్ అవతార్‌లో ఎలా ఆకట్టుకుంటాడనేది ఈ ఫస్ట్ షాట్‌తో క్లారిటీ వచ్చేసింది. టాలీవుడ్‌లో ‘పెద్ది’ హవా మొదలైంది. రిలీజ్ వరకు ఈ జోష్ కొనసాగనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button