Ram Charan: ‘పెద్ది’గా పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్

Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్సీ 16’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. అందరూ ఊహించినట్టే ‘పెద్ది’ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ చరణ్ స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించాడు. ఈ లుక్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. గడ్డంతో రగ్గడ్ లుక్‌లో, గ్రామీణ నేపథ్యంలో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు.
ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఈ లుక్‌ను రూపొందించాడు. ఈ లుక్ కథలోని రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌ను సూచిస్తుంది. ఉత్తరాంధ్ర పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫస్ట్ లుక్ విడుదలతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా కొట్టనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది.