సినిమా

Ram Charan: గ్లోబల్ స్టార్ బర్త్ డే ట్రీట్ ఏంటంటే?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్స్ట్ నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది.

RC 16 సినిమాకి ప్రచారంలో పెద్ది అనే టైటిల్ బలంగా వినిపిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో? పెద్ది టైటిల్ స్టోరీకి పక్కాగా యాప్ట్ అవుతుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇదే టైటిల్ కన్పమ్ అవుతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అలాగే చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసే అవకాశం కనిపిస్తుంది.

చరణ్ బర్త్ డే మార్చి 27. ఈ రోజు చరణ్ కు స్పెషల్ గా నిలిచేలా అభిమానులకు గుర్తుండి పోయేలా అన్న పూర్ణ స్టూడియోస్ లో ఓ ఫోటో షూట్ నిర్వహించారట. అయితే ఈ ఫోటో షూట్ దేనికి సంబంధించింది అన్నది క్లారిటీ లేదు.కానీ అభిమానులు మాత్రం చరణ్ బర్త్ డేకి భారీగానే ప్లాన్ చేస్తున్నారని ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button