సినిమా

Ram Charan: ధనుష్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ హీరో ధనుష్ కలిసి సినిమా చేయనున్న వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ధనుష్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ మాస్ మసాలా చిత్రం తెరకెక్కనుందని టాక్. ఎమోషనల్ డెప్త్‌తో కూడిన ఇంటెన్స్ కథను ధనుష్ వివరించగానే, చరణ్ ఆశ్చర్యపోయి వెంటనే ఒప్పుకున్నారట.

ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సానాతో ‘పెద్ది’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండగా, ఆ తర్వాత సుకుమార్‌తో మరో బిగ్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ రెండు పూర్తయ్యాకే ధనుష్-చరణ్ కాంబో షురూ కానుంది. ‘ప పాండి’, ‘రాయన్’ వంటి హిట్స్‌తో దర్శకుడిగా మెప్పించిన ధనుష్, తెలుగు ఫ్యాన్స్‌ను తన స్టోరీ టెల్లింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’తో బిజీగా ఉన్న ధనుష్, త్వరలో దీన్ని పూర్తి చేసి చరణ్‌తో కొత్త సాహసాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ వార్తతో ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. చరణ్ యాక్షన్ హవా, ధనుష్ ఎమోషనల్ టచ్ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ కాంబో ప్రారంభమై, ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button