సినిమా

ఓజీ vs అఖండ-2: వెనక్కి తగ్గేది ఏది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, నందమూరి బాలకృష్ణ అఖండ-2 సినిమాలు సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనున్నాయా? ఏ సినిమా తప్పుకుంటుందనే చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, అదే రోజున బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 కూడా విడుదలకు ముస్తాబవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం, వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యంతో సెప్టెంబర్ రిలీజ్ కష్టమనే టాక్ వినిపిస్తోంది.

దీంతో అఖండ-2ను డిసెంబర్‌కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ మూవీ టీం మాత్రం అనుకున్న టైంకి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఓజీ మేకర్స్ మాత్రం సెప్టెంబర్ 25నే రిలీజ్ చేస్తామని ధీమాగా ఉన్నారు. ఈ బాక్సాఫీస్ ఢీ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button