సినిమా

మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన.. మెగా ఫ్యామిలీ సంబరాలు

Ram Charan-Upasana: మెగా కుటుంబంలో మరోసారి ఆనందం వెల్లివిరిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండో సారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి వేడుకలతో పాటు ఉపాసన సీమంతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ “డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జోడించారు.

ఈ జంటకు 2023 జూన్‌లో చిన్నారి క్లీంకార పుట్టగా, రెండు సంవత్సరాల తర్వాత మరోసారి సంతోషవార్త అందుకున్నారు. వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉపాసనకు ఆశీర్వాదాలు అందిస్తూ కనిపించారు. ఈ వార్తతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. “సింబా వస్తున్నాడు!” అంటూ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button