ఆంధ్ర ప్రదేశ్
నేడు హైకోర్టులో కాకాణి బెయిల్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

Kakani: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి ఎపిసోడ్‌పై ఉత్కంఠ నెలకొంది. నేటి పోలీస్ విచారణకు హాజరుపై ఆసక్తి రేగుతోంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని.. కాకాణి నివాసానికి వెళ్లి పొదలకూరు పోలీసులు నోటీసులు అందించారు. ఉదయం 11కి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఇవాళ విచారణకు హాజరుకాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామంటున్నారు పోలీసులు. కాగా రుస్తుం మైనింగ్ కేసులో ఏ4 నిందితుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరోవైపు నేడు హైకోర్టులో కాకాణి బెయిల్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.