జాతియం

Rajnath Singh: యుద్ధం అక్కర్లేదు..పీవోకే మనదే

Rajnath Singh: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, అది తనంతట తానుగానే భారత్‌లో విలీనం అవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పీవోకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

మొరాకో పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో ప్రజలు పాకిస్థాన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్నారని ఆయన తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button