సినిమా

రజినీ రిటైర్‌మెంట్?

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ 2 తర్వాత సుందర్ సీతో సినిమా చేస్తారట. ఆ తర్వాత కమల్‌తో చివరి చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తరువాత ఆయన రిటైర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

రజినీకాంత్ జైలర్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ హైప్ ఉంది. దీని తర్వాత సుందర్ సీతో ఒక చిత్రం ఉంటుంది. ఆ తర్వాత కమల్‌తో మల్టీస్టారర్ చివరి సినిమా కానుందని సమాచారం.

ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన రిటైర్ అవుతారని బజ్ నడుస్తుంది. దీంతో ఫ్యాన్స్‌కు షాక్ అవుతున్నారు. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలి. ప్రస్తుతం రజినీ లైనప్‌లో ఇవి మాత్రమే ఉన్నాయి. అందుకే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button