సినిమా
రజనీకాంత్ కూలీ సంచలనం!

Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఆయన తాజా చిత్రం కూలీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తోంది. తమిళ సినిమా చరిత్రలో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ₹ 450 కోట్ల దాకా కలెక్షన్లను దాటి, తమిళ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, రజనీకాంత్ యాక్షన్ అవతారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానుల ఆరాధనతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది.



