సినిమా

పొంగల్‌కు థలైవర్ ధమాకా!

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి సంబంధించి అధికారిక అప్‌డేట్ వెలువడింది. యంగ్ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2027 పొంగల్‌కు రిలీజ్ కానుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించేది యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి. శివకార్తికేయన్‌తో డాన్ చిత్రం తీసి, తన సత్తా చూపించిన సిబి ఇప్పుడు థలైవర్‌తో కలిసి పనిచేయనున్నారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. రజనీ చిత్రాలకు అనిరుధ్ సంగీతం ఎల్లవేళలా టాప్ హైలైట్‌గా నిలుస్తుంది.

కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఆర్. మహేంద్రన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 పొంగల్ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, థలైవర్ అభిమానులు ఈ కాంబినేషన్‌కు ఎక్సైట్ అవుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button