ఆంధ్ర ప్రదేశ్
విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జంగాలపల్లిలో ఓ కుటుంబాన్ని విడదల రజిని పరామర్శించడానికి వెళ్లారు. విడుదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను విడదల రజినీ ప్రశ్నించారు. విడదల రజిని కారులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు.
విడదల రజినిని పోలీసులు నెట్టేశారు. మాజీ మహిళా మంత్రి అని కూడా చూడకుండా రజిని పట్ల సీఐ సుబ్బరాయుడు అమానుషంగా వ్యవహరించారు. విడదల రజినిపై కూడా కేసు పెడతానంటూ సుబ్బరాయుడు బెదిరించారు. పోలీసుల తీరుపై విడదల రజినీ మండిపడ్డారు.