Rajendra Prasad: వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు

Rajendra Prasad: నితిన్- శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు వార్నర్‌తో తనకి ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు.
రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన చేశారు. ఏదో మాట్లాడుతూ ఓవర్ ఫ్లోలో వార్నర్‌ని తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్. దీంతో సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు రాబిన్‌హుడ్ టీమ్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ తాజాగా వార్నర్ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. బహిరంగ క్షమాపణలు చెబుతూ వీడియో వదిలారు.
రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోటి నుంచి అనుకోకుండా ఓ మాట దొర్లింది.. అది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. ఆ ఫంక్షన్‌కి వచ్చే ముందు మేమంతా కలిసున్నాం.. ఎంత అల్లరి చేశామంటే కనుక నితిన్‌ని, అతడ్ని మీరంతా నా పిల్లల్లాంటోళ్లు అని అన్నారు.