సినిమా

మహేష్ – రాజమౌళి సినిమాలో సంచలన ఎంట్రీ సీన్!

Mahesh-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అంచనాలు పెంచేస్తుంది. హాలీవుడ్ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా, తాజాగా ఓ సంచలన సీక్వెన్స్ షూట్ ప్లాన్‌లో ఉందట.

మహేష్ బాబు – రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో రోజుకో వార్త సంచలనం సృష్టిస్తోంది. హాలీవుడ్ టచ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం, రాబోయే షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్ పాత్రల గ్రాండ్ ఎంట్రీ సీన్‌ను చిత్రీకరించనున్నారు.

ఈ సీక్వెన్స్‌లో మహేష్, ప్రియాంకల పాత్రల పరిచయంతో పాటు కథలోని ముఖ్య భాగాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ సీన్‌ను అత్యంత భారీ స్థాయిలో, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించేందుకు రాజమౌళి టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం గురించి వస్తున్న లీకులు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button