తెలంగాణ
Rajaiah: కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకోకపోతే తాట తీస్తా

Rajaiah: ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే..రేవంత్‌రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విమర్శించారు. సక్రమ సంబంధమే అయితే బీఆర్ఎస్ పార్టీకి..ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం నిజ స్వరూపం తెలిసే…కాంగ్రెస్ నాయకులు ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారని అన్నారు.
బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం.. స్టేషన్ ఘన్‌పూర్‌ను కడియం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. .కడియం గత ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. ఇరిగేషన్ రంగాన్ని మొదటి దశలో ఉంచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కడియం నోరు అదుపులో పెట్టుకోకపోతే తాట తీస్తామని హెచ్చరించారు.