తెలంగాణ
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుపై రాజాసింగ్ ఫైర్

Raja Singh: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డ్ మెంబర్, టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డులోకి తీసుకునేముందు సభ్యులకు హిందూధర్మంపై అవగాహన, మర్యాద ఉందా లేదా అని చూసుకోవాలని రాజాసింగ్ హితవు పలికారు.
తెలుగుదేశంలో ఇంకా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని రాజాసింగ్ అన్నారు. ఎం.ఎస్. రాజుపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరెవరూ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయరని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.



