తెలంగాణ
Raja Singh: హైదరాబాద్‌లోనూ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి

Raja Singh: భద్రాచలంలో G+2 అనుమతి తీసుకొని అక్రమంగా 6 అంతస్తులు నిర్మించిన భవనం కూలిపోయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయన్నారు.
ఇలాంటి సంఘటనలు జరిగితే GHMC కమిషనర్ బాధ్యత వహిస్తారా ? లేక ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. గోషామహల్‌తో పాటు మొత్తం హైదరాబాద్ లో చాలా అక్రమాలు జరుగుతున్నాయన్నారు రాజాసింగ్. అధికారులు లంచాలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు మీ కళ్లకు కనిపించడం లేదా అని అడిగారు.



