తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ దూకుడు పెంచిన సిట్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. కేసులో ఉన్నవాళ్లను మళ్లీ వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ప్రణీత్ రావు ఎల్లుండి ప్రభాకర్ రావును మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు వాటిని మూసీ నదిలో పడివేసినట్లు పోలీ సులు గుర్తించారు.
అయితే ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారనే అంశంపై ఇప్పుడు సిట్ విచారణ చేపట్టనుంది. ఇందులో ప్రభాకర్ రావు హస్తం ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని చెబుతున్నారు ప్రభాకర్ రావు.