తెలంగాణ
Raja Singh: పోలీసులకు పాకిస్తాన్ పట్ల ఎందుకంత ప్రేమ

Raja Singh: తెలంగాణ పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. తెలంగాణ పోలీసులకు పాకిస్తాన్ పట్ల ఎందుకంత ప్రేమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహెల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా తన కార్యాలయానికి వచ్చిపోయేవాళ్లు తొక్కుకుంటూ వెళ్లేలా పాకిస్తాన్ జెండాను నేలకు అతికిస్తే దాన్ని పోలీసులు తొలగిచండం ఏంటని మండిపడ్డారు.
తన కార్యాలయంలో తమ కార్యకర్తలు మెట్ల వద్ద పాకిస్తాన్ జెండాను ప్రింట్ తీసుకువచ్చి అతికించారు. వాళ్లు మంచి పని చేశారు. కానీ లోకల్ పోలీసులకు భయం ఎందుకో? ఏ దేశ ద్రోహి వారికి కంప్లయింట్ చేశారో తెలియదు. ఆ ఫ్లెక్సీని పోలీసులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులకు ఇస్లామిక్ జెండాకు, పాకిస్తాన్ జెండాకు తేడా తెలియదా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.