రాజాసాబ్ పార్ట్ 2′ ఫిక్స్?

Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ గగ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే ‘రాజాసాబ్ పార్ట్ 2’ కూడా ఫిక్స్ ఫిక్స్ అయ్యిందట. పూర్తి వివరాలు చూద్దాం
ఆ మధ్య రిలీజ్ చేసిన రాజాసాబ్ ట్రైలర్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరించింది.కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను నవంబరు 5న రిలీజ్ చేస్తామని నిర్మాత విశ్వప్రసాద్ మీడియా సమక్షంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మరొక క్రేజీ అప్డేట్ తెలిసింది. రాజాసాబ్ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట.
అందుకు సంబంధించి కథా చర్చలు కూడా ముగిసాయట. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసి పాయింట్ కూడా చెప్పాడట దర్శకుడు మారుతి. పాయింట్ కూడా నచ్చడంతో ఒకే చెప్పేశాడట డార్లింగ్. జవవరి 9న రాబోతున్న రాజసాబ్ సినిమా చివర్లో కూడా సెకండ్ పార్ట్ కు సంబంధించి లీడ్ ఇస్తారట. మరి ఏమవుతుందో చూడాలి.



