తెలంగాణ
తెలంగాణలో 4రోజులపాటు వర్షాలు

Heavy Rain: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రెండ్రోజుల్లో ఏపీకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
అయితే ఇప్పటికే కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరంతోపాటు మణిపూర్, నాగాలాండ్‌కు రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జూన్ 2 తర్వాత రుతుపవనాల వేగం తగ్గనున్నట్లు తెలిపింది.