తెలంగాణ

హైదరాబాద్‌లో చల్లబడ్డ వాతావరణం

హైదరాబాద్‌లో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. నగరంలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయ్యింది. నగరంలో కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్నారు.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రానికి వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడనుందని సూచించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button