తెలంగాణ
Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు..!

Rains: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో ముసురుతో చుట్టుకున్నది. కాగా నిన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు చోట్ల చల్లని గాలులు వీస్తూ, వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో ఇది కొనసాగుతుందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపారు.