తెలంగాణ
వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

Singareni: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతుంది. ఓపెన్ కాస్ట్‌లో 3రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి, కిష్టారం గనుల్లో 92 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పాడింది. రామగుండంలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.