ఆంధ్ర ప్రదేశ్
వనస్థలిపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ దాడులు

కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గత మూడు రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు చేస్తోంది. రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను గుర్తించి సీజ్ చేస్తోంది రాష్ట్ర రవాణాశాఖ.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మికంగా దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులపై కేసు నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న కేవీఆర్ ట్రావెల్స్‌కి చెందిన ఓ బస్సును సీజ్ చేశారు.



