తెలంగాణ
రాయికల్ వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకుల సందడి

Karimnagar: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. జలపాతం అందాలను తిలకిస్తూ సందర్శకులు చరవాణిలో రాయికల్ జలపాతం ఫోటోలను చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నారు.
రాయికల్ జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు జలకాలాడుతూ తల స్నానాలు చేస్తున్నారు. జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి జలపాతం అందాలను వీక్షించడానికి సందర్శకులు తరలిస్తున్నారు.