Rahul Ravindran: చున్నీ విసిరిన అమ్మాయి.. అది స్టంట్ కాదు

Rahul Ravindran: ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసి లేడీ అభిమాని ఒకరు చున్నీ విసిరేసి రాహుల్ రవీంద్రన్‌ను హగ్ చేసుకున్న వీడియో వైరల్ అయింది. ఇది మూవీ టీం పీఆర్ స్టంట్ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే దీనిపై దర్శకుడు రాహుల్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ముచ్చట గురించి పూర్తి వివరాలు చూద్దాం.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న విడుదలైంది. ఓ థియేటర్లో స్క్రీనింగ్ చూస్తుండగా ఓ యువతి సినిమా చూసి ధైర్యం వచ్చి తన చున్నీ విసిరేసి రాహుల్‌ను గట్టిగా హగ్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది పీఆర్ స్టంట్ అంటూ తీవ్ర ట్రోల్స్ వచ్చాయి. నిర్మాత స్కీన్ సక్సెస్ మీట్లో క్లారిటీ ఇచ్చినా ట్రోల్స్ ఆగకపోవడంతో రాహుల్ స్వయంగా స్పందించారు. “అదంతా అనుకోకుండా జరిగింది, పీఆర్ స్టంట్ కాదు.
మేము ఆ థియేటర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నది కేవలం 20 నిమిషాల ముందు మాత్రమే, అలాంటప్పుడు స్టంట్ ఎలా ప్లాన్ చేస్తాం?” అని ఆయన స్పష్టం చేశారు. అమ్మాయి మీద నెగిటివిటీ రాకూడదని ఇప్పటిదాకా మౌనంగా ఉన్నానని చెప్పారు. చున్నీ తీసేయమని సినిమాలో చెప్పలేదని, అది వ్యక్తిగత ఇష్టమని స్పష్టం చేశారు. మగవాళ్లు షర్టు చింపుకున్నప్పుడు సంస్కృతి గురించి మాట్లాడరా అని రాహుల్ నిలదీశారు.



