జాతియం
Rahul Gandhi: ఎన్డీయే ప్రభుత్వం చర్చకు భయపడుతోంది

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను మాట్లాడుతుండగా ఎంపీలు అడ్డుకున్నారని, తాను మాట్లాడటం వారికి ఇష్టం లేదని, సభలో చర్చకు ఎన్డీయే ప్రభుత్వం భయపడుతోందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మాజీ సైన్యాధిపతి జనరల్ నరవాణే రాసిన పుస్తకం గురించి తాను సభలో ప్రస్తావించకూడదని ప్రభుత్వం పదేపదే అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు.
మొదట పుస్తకాన్ని కోట్ చేయకూడదన్నారని, ఆ తర్వాత మ్యాగజైన్ గురించి మాట్లాడుతున్న ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. చివరకు రక్షణ మంత్రి ఆ పుస్తకం అసలు ప్రచురణ కాలేదని అబద్ధం చెప్పారని, కానీ తమ దగ్గర ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ స్పష్టం చేశారు.



