జాతియం
Rahul Gandhi: దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయని ఆరోపించారు. తమ దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై అనుమానాలున్నాయన్నారు.
ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడటంపై దృష్టి పెట్టామన్నారు. ఆధారాల కోసం 6 నెలలు పని చేశామని తెలిపారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు.