తెలంగాణ
Rahul Gandhi: తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేర్చే దిశగా.. ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతోందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అభినందనీయమని చెప్పారు రాహుల్. అలాగే.. రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను.. ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
పార్టీ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా.. ప్రజా ప్రతినిధులందరూ నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాహుల్ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. మరింత ముందుకెళ్తామంటూ ఇటీవల రాహుల్‌కు పొన్నం లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా రాహుల్ మంత్రికి లేఖ రాసి అభినందనలు తెలిపారు.