తెలంగాణ
Raghunandan Rao: కవిత మరో షర్మిల కాబోతోంది.. రఘునందన్ హాట్ కామెంట్స్

Raghunandan Rao: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. MLC కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కన్పిస్తోందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తోందంటూ రఘునందన్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు.
కవిత కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయంటూ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు రఘునందన్ రావు.