తెలంగాణ
Raghunandan Rao: ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ నినాదం తీసుకుంది

Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీసీ బిల్లులో ఓ మతాన్ని కలిపి అసెంబ్లీ తీర్మానం చేస్తే అదెలా చెల్లుతుందని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసమే 42 శాతం తీర్మానం చేసి పంపండి మేము కూడా మద్దతు పలుకుతాం అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ ఎజెండా తీసుకుందన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రవర్గంలో సగం బీసీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చెయ్యండి అన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టామని గప్పాలు వద్దు అన్నారు.