జాతియం
Raghav Chadha: బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా ఎంపీ రాఘవ్ చద్దా

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డెలివరీ బాయ్ అవతారమెత్తారు. బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ డ్రెస్ ధరించి ఇంటింటికీ వెళ్లి వస్తువులు డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ‘బోర్డు రూమ్‌లకు దూరంగా అట్టడుగు స్థాయిలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
డెలివరీ భాగస్వాములు ఎదుర్కొనే కష్టాలు, తక్కువ వేతనం, సామాజిక భద్రత, పని గంటల వంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



