Radhika: రాధికకు అశ్వస్థత.. షాక్ లో అభిమానులు!

Radhika: ప్రముఖ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ అస్వస్థతకు గురై చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రముఖ సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ డెంగ్యూ జ్వరంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జులై 28న ఆమె ఆసుపత్రిలో చేరగా, మొదట సాధారణ జ్వరంగా భావించినప్పటికీ, పరీక్షల్లో డెంగ్యూ నిర్ధారణ అయింది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది, కానీ ఆగస్టు 5 వరకు వైద్య పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు. రాధికా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి, నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు.
‘కిళక్కే పోగుం రైల్’ చిత్రంతో తమిళ సినిమాల్లో అడుగుపెట్టిన ఆమె, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా గుర్తింపు పొందారు. ఆమె అస్వస్థత వార్తతో అభిమానులు ఆందోళన చెందుతూ, సోషల్ మీడియాలో #GetWellSoonRaadhika హ్యాష్‌ట్యాగ్‌తో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చెన్నైలో డెంగ్యూ కేసులు పెరుగుతుండగా, అధికారులు నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు.