Assam: అస్సాంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రార్థనగా ఖురాన్ ఆయత్

Assam: గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే గురువు పరబ్రహ్మతో సమానం. అమ్మ మనకు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారు. శిలను శిల్పగా మార్చినట్లు మనలోని చేడును తీసేసి మంచి గుర్తింపును ఇస్తారు. భారతదేశ భవిత్యవ్యాన్ని నిర్ణయించే భావి భారతాన్ని తయారు చేయడానికి గురువులు, పాఠశాలలు ఉపయోగపడతాయి. అలాంటి గుడిలో, గొప్ప వృత్తిలో ఉన్న కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే అవమానం తెస్తున్నారు. స్కూల్ పిల్లలు చేసే ప్రతిజ్ఞలో ఖురాన్ నేర్పిస్తున్నారు. దానినే ప్రతిజ్ఞగా చేయిస్తున్నారు. ఇంతకీ పిల్లలకు మత మరకలను అంటిస్తున్న ఆ మతోన్మాదులు ఎవరు..? ఎక్కడ జరిగింది ఈ ఘటన..?
హిందూ మతం ప్రమాదంలోకి వెళ్లబోతుంది. విద్యార్థుల భవిషత్య్తు నుంచి మొదలు పెడితే వ్యాపార వేత్తలు, కూలిలు ఇలా అన్ని వైపుల నుంచి ఓ కుట్ర జరుగుతుంది అని మాత్రం అర్థం అవుతోంది. ఇప్పటికే సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే మరోపక్క నుంచి స్కూల్ పిల్లలో విద్యావ్యవస్థలో పాటు దేశ భక్తిని పెంపొందించాల్సింది పోయి మత తత్వాన్ని నూరి పోసే ప్రయత్నం జరుగుతుంది. దానికి అస్సాంబో బీజం పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఈ కుట్రను గవర్నమెంట్ పాఠశాలలోకి కూడా తీసుకొచ్చారు.
అస్సాంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చిన్న పిల్లలు ఉదయం ప్రార్థనగా ఖురాన్ ఆయత్ను పఠిస్తున్నట్లు కనిపించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బొంగైగావ్ జిల్లాలోని 619 భద్రగావ్ LP పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఆ పాఠశాలలో చాలా మంది హిందూ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ సంఘటన బయటకి రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు.
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది హిందూ తల్లిదండ్రులు ఉదయం ప్రార్థనలో ఖురాన్ ఆయత్ పఠించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులతో సహా, పలు హిందూ సంఘాలు ఈ సంఘటనకు వ్యతిరేకంగా నిరసలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా హిందూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. మరికొందరు విద్యా సంస్థలలో లౌకికవాదం మతపరమైన ఆచారాల మధ్య సమతుల్యతపై ఆందోళనలను హైలైట్ చేశారు.
ఈ సంఘటనపై జిల్లా కమిషనర్ వెంటనే విచారణ ప్రారంభించారు. అయితే జిల్లా విద్యా శాఖ ప్రాథమిక దర్యాప్తులో ఉదయం అసెంబ్లీ సమయంలో ఖురాన్ మొదటి అధ్యాయాన్ని పఠించడం రోజువారీ దినచర్య అని తేలింది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలో ఎక్కువగా మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నారని పిటిఐ నివేదిక తెలిపింది. జిల్లా విద్యాశాఖ అధికారి దర్యాప్తు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెహెరుల్ ఇస్లాం, సర్వశిక్ష అభియాన్ CRC నిర్మల్ చౌదరిని సస్పెండ్ చేశారు. పాఠశాలలోని మరో ఇద్దరు ఉపాధ్యాయులను కూడా అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెహెరుల్ ఇస్లాం 2015 లో పాఠశాలలో చేరినప్పటి నుండి ఉదయం ప్రార్థన కోసం సూరా ఫతేహాను చెప్పిస్తున్నట్లు తేలింది. ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థన పేరుతో ఇతరులపై ఇస్లామిక్ మతాన్ని రుద్దుతున్నారని స్థానికులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలని ఈ దురాచారాలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటన జరగడం అనేది మొదటిది కాదని స్థానికులు అంటున్నారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులు ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేసిన సంఘటనల గురించి గతంలో కూడా అనేక ఫిర్యాదులు చేశారు.
మా రాష్ట్రం అంతటా, విద్యార్థులు తరగతులకు ముందు ఉదయం ప్రార్థనలతో తమ రోజును ప్రారంభిస్తారని లఖింపూర్ ఎమ్మెల్యే మనబ్ దేకా ఆగస్టు 18 తన ‘X’ఖాతా ద్వారా అదే వీడియోను పంచుకున్నారు. కానీ బొంగైగావ్లోని ఒక పాఠశాలలో రోజువారీ ప్రార్థనలకు బదులుగా, పిల్లలతో ఖురాన్ పఠనం చేయిస్తున్నారు. ఎవరి ప్రభావంతో ఈ యువ విద్యార్థులను అలా చేయమని బలవంతం చేస్తున్నారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆయన వాదనను అనుసరించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అదే రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ధృవీకరించారు. పాఠశాలల్లో ఎలాంటి తీవ్రవాదాన్ని అనుమతించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో రాడికలైజేషన్ను నిరోధించడమే ఈ చర్య లక్ష్యమని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
కాగా కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందరు దీనిని ఎంపిక చేసిన దౌర్జన్యంగా భావించి విమర్శించారు. సరస్వతి వందన, గాయత్రి మంత్రం వంటి హిందూ ప్రార్థనలను తరచుగా పాఠశాలల్లో విధించడం జరుగుతుందని కానీ చాలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హిందూవులు మండిపడుతున్నారు.



