PVN Madhav: బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

PVN Madhav: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ MLC పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాధవ్ ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభంకానుంది.
ఆర్‌ఎస్ఎస్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోని వివిధ పదవులను మాధవ్ నిర్వహించారు. ఆయన తండ్రి చలపతిరావు ఎమ్మెల్యేగా, బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా పార్టీకి విస్తృత సేవలందించారు. పార్టీకి ఆ కుటుంబం చేసిన సేవలను గుర్తించిఏపీ కమల దళపతిగా మాధవ్ వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది. అధ్యక్ష పీఠానికి పలువురి పేర్లు వినిపించినా ఎన్నిక ప్రకియ వచ్చేసరికి అధిష్ఠానం నిర్ణయంతో నాయకులంతా ఏకీభవించారు. మాధవ్ అభ్యర్థిత్వాన్ని అందరూ ఏకగ్రీవంగా సమ్మతించడంతో ఎన్నిక లాంఛనమే అయింది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన 52 ఏళ్ల మాధవ్ బీజేపీ సేవలో తన తండ్రి పీవీ చలపతిరావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్ర వర్సిటీలో MBA చేసిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్ విశాఖ నగర కార్యదర్శిగా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా పనిచేశారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించారు. బీజేపీ యువమోర్చాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు.