Pushpa 2 The Rule Collections: అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోతున్న పుష్ప-2.. సినీ చరిత్రలో సరికొత్త అద్యాయం..

Pushpa 2 The Rule Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 హవా కొనసాగుతోంది. రికార్డుల విషయంలో తగ్గేదేలే అంటోంది. ప్రీమియర్స్ షో నుంచే బాక్సాఫీస్‌పై మొదలైన పుష్పరాజ్ రూల్.. రోజు రోజుకి అత్యధిక కలెక్షన్లతో కొనసాగుతోంది. అల్లు అర్జున్ నట విశ్వరూపం.. డైరెక్టర్ సుకుమార్ అత్యుద్భుతమైన టేకింగ్.. మెస్మరైజింగ్ కథ కథనాలు వెరసి.. పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం క్రియేట్ చేస్తోంది.
విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డును నెలకొంది పుష్ప-2. ఇండియాలో ఈ మూవీ రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే వసూళ్లలో దూసుకుపోతోంది. 21 రోజుల్లో 17 వందల 5 కోట్లు సాధించిన.. తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా 17 వందల కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది పుష్ప-2.
బాలీవుడ్‌లో పుష్ప-2 సినిమా సునామీలా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును సాధిస్తుండడంతో.. సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది.