ఆంధ్ర ప్రదేశ్
Purandeswari: రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది

Purandeswari: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమార స్వామి పాల్గొన్నారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పురంధేశ్వరి అన్నారు.
కేంద్రం వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈనామ్ ద్వారా రైతులు నేరుగా పంటను విక్రయించవచ్చని అన్నారు. దేశంలో 9 కోట్ల మంది రైతులకు కేంద్రం నగదు బదిలీ చేస్తుందన్నారు.