సైక్ సిద్ధార్థ్: యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం!

Psych Siddhartha Movie Review: నందు, యామినీ భాస్కర్ నటించిన తాజా చిత్రం సైక్ సిద్ధార్థ్ జనవరి 1న విడుదలైంది. ట్రైలర్‌లోని బూతు డైలాగ్స్ వైరల్ కావడంతో యూత్‌లో హైప్ ఏర్పడింది. దర్శకుడు వరుణ్ రెడ్డి కథనంతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించారు.
సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా సంయుక్త నిర్మాణంలో వచ్చిన సైక్ సిద్ధార్థ్ మొదట డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, జనవరి 1కి వాయిదా పడింది. ట్రైలర్ వైరల్ కావడంతో యూత్ టార్గెట్‌గా విడుదలైంది. రొటీన్ కథను డిఫరెంట్‌గా చూపించాలని దర్శకుడు వరుణ్ రెడ్డి ప్రయత్నించారు. కానీ కథలో బలం లేకపోవడంతో షార్ట్ ఫిల్మ్ ఫీల్ కలుగుతుంది.
సన్నివేశాలు జెన్ జీ బ్యాచ్‌ను ఎంటర్టైన్ చేస్తాయి. అయితే అవసరానికి మించిన అడల్ట్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలిగించాయి. ఫస్టాఫ్ సిద్ధార్థ్ చుట్టూ తిరుగుతుంది. సెకండాఫ్ కాస్త బెటర్. ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. కానీ హీరోకు బ్యాక్ స్టోరీ లేకపోవడం మైనస్. నందు సైకో పాత్రలో జీవించాడు. యామినీ భాస్కర్, ప్రియాంక రెబెక్కా బాగా నటించారు. నేపథ్య సంగీతం డిఫరెంట్‌గా ఉంది. ఎడిటింగ్ కొత్తగా కనిపించింది. మొత్తంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.



