ఆంధ్ర ప్రదేశ్
ఆదోని జిల్లా సాధన కోసం బంద్

కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నాయకులు , ఆందోళనకారులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకోవడమే కాకుండా, ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహా ధర్నా నిర్వహించారు.



