తెలంగాణ
మంచిర్యాల జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ

మంచిర్యాల జిల్లాలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ సమావేశానికి హాజరయ్యారు. మంత్రికి అందజేసిన అభ్యర్ధుల పేర్లలో మార్పులు జరిగాయని ఆశావాహులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. సమావేశం మధ్యలోనే ఇంచార్జ్ మంత్రి కృష్ణారావు వెళ్లిపోయారు.



