ఆంధ్ర ప్రదేశ్
ప్రొద్దుటూరు శివాలయంలో కుంభకోణంపై విచారణ

రాజ్‌న్యూస్ వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ప్రొద్దుటూరు శివాలయంలో కుంభకోణంపై విచారణ చేపట్టింది. బంగారం, వెండి ఆభరణాల మాయంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెక్కులు, బంగారం, వెండి కుంభకోణంపై డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారణ చేపట్టారు. చెక్కులను, బంగారు, వెండి ఆభరణాల కాజేసినట్లు జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఒప్పుకున్నారు.
ఈ కుంభకోణం వెనుక ఆలయ ఈవోలు గా పనిచేసిన శంకర్ బాలాజీ, రామచంద్రా చార్యులు, ప్రస్తుత ఇంచార్జ్ ఈవో వెంకట సుబ్బయ్యలు ఉన్నట్లు విచారణ వెలుగులోకి వచ్చాయి. కాజేసిన చెక్కులు, బంగారు, వెండి ఆభరణాలను నెల రోజుల్లో అప్పగిస్తామని నిందితులు ఒప్పుకున్నారు.



