Proddatur Dussehra: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రొద్దుటూరు దసరా’

Proddatur Dussehra: తెలుగు సంస్కృతి, పండుగల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో తెరకెక్కిన ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఈటీవీ విన్‌లో ప్రేక్షకులను పలకరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల అద్భుత వైభవం, ప్రజల ఆచారాలు, భక్తి, కళా సంప్రదాయాలను చూపిస్తూ రూపొందించిన ఈ 40 నిమిషాల డాక్యుమెంటరీని దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ రూపొందించారు. ప్రేమ్ కుమార్ వాలపాలా నిర్మాణంలో బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సహకారంతో ఈ చిత్రం రూపొందింది.
ఉత్సవాల సమయంలో ప్రజల ఉత్సాహం, సాంప్రదాయ ప్రదర్శనలు, భక్తి భావం అన్నీ ఈ చిత్రంలో నిజ జీవిత దృశ్యాలతో చూపించారు. హై టెక్నికల్ క్వాలిటీ, అద్భుత విజువల్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.
ప్రస్తుతం స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా, కిలారి సుబ్బారావు పీఆర్‌ఓగా వ్యవహరిస్తున్నారు. బాల్కనీ ఒరిజినల్స్ నుంచి త్వరలో మరిన్ని సంస్కృతి ఆధారిత డాక్యుమెంటరీలు విడుదల కానున్నాయని మేకర్స్ వెల్లడించారు.



