ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం

విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. హఠాత్తుగా మినీ బస్సులో నుంచి మంటలు చెల రేగడం తో డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి కిందకి దిగాడు.కాగాబస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఏపీ 31 UU 1979 వినీత ట్రావెల్స్ చెందిన బస్సుగా తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.గాజుకాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



