జాతియం
మిజోరంలో బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ

మిజోరాంలో ప్రధాని మోడీ పర్యటించారు. ‘బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్’ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.మిజోరాం ప్రజలకు రైల్వే లైన్ ఆలస్యంగా అందినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కేవలం రైల్వే కనెక్షన్ కాదన్నారు. మిగతా మినహాయింపుల కంటే ఇది మిజోరాం కోసం పరివర్తనాత్మక జీవనాధారంగా మారుతుందన్నారు.
ప్రజల జీవితాలు, జీవనోపాధులు విప్లవాత్మకంగా మారుతాయని పేర్కొన్నారు. రైల్వే లైన్ రైతులు, వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే పర్యాటక రంగం, రవాణా రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు.



