జాతియం
Modi: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ

Modi: ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. యూఎస్‌లో ల్యాండ్ అయిన మోదీకి NRIలు గ్రాండ్ వెల్కం చెప్పారు. ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన మోదీ.. రెండ్రోజులపాటు అగ్ర రాజ్యంలోనే పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ట్రంప్‌తో భేటీ కానున్నారు.
అలాగే ప్రపంచ కుబేరుడు మస్క్‌తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. స్టార్‌లింక్ సేవలపై మస్క్‌తో చర్చించే అవకాశం కన్పిస్తోంది. భారత మార్కెట్లో అడుగుపెట్టాలని స్టార్ లింక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మస్క్, మోదీ సమావేశం కానున్నట్లు టాక్ వినబడుతోంది. ఇక స్పెక్ట్రం వేలం వేయడం కాకుండా కేటాయిస్తే బాగుంటుందనేని మస్క్ ఆలోచన.