తెలంగాణ
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025

రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2025 వేడుకలు మాదాపూర్ లోని HICC లో ఘనంగా జరిగాయి. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఆరవ ఎడిషన్ ఆధ్వర్యంలో పన్నెండు విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన ముప్పై మందికి అవార్డ్స్ ను ప్రదానం చేశామని ఆర్గనైజర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అమౌంట్ ను గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు.
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారి టాలెంట్ ను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. సినీ నటుడు సుదీర్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి అవార్డులను అందచేశారు. ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.



