ఆంధ్ర ప్రదేశ్
సామర్లకోట భీమేశ్వరాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్

కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ నిబంధనలు అతిక్రమించి ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. ఆలయ ఆవరణ, పుష్కరిణీల వద్ద ఫొటో షూట్ చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



